ఓటర్ల వివరాలు ఖచ్చితత్వంతో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ఛాంబరు నుండి శుక్రవారం ఎలెక్టర్స్ మ్యాపింగు, ఫారమ్స్ డిస్పోసల్స్ పై లక్ష్యాలను పూర్తి చెయ్యాలని ఈఆర్వోలు, సహాయక ఈఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టరు కె.వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఫారమ్స్ డిస్పోసల్స్, ఎలెక్టర్స్ మ్యాపింగ్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలుతో పాటు ఎలక్షన్ ప్రక్రియ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ఫారమ్స్ పరిశీలన,ఎలెక్టర్స్ మ్యాపింగు, పెండింగు ధరఖాస్తులు త్వరితగతిన పరిష్కారం, ఓటర్ల వివరాలు ఖచ్చితత్వంతో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలెక్టర్ మ్యాపింగు ప్రక్రియలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని జాబితా పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండేలా కృషి చెయ్యాలని సూచించారు. క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాలు ప్రక్రియ జనవరి 6 నుండి ఫిబ్రవరి 27 తేదీ వరకు కొనసాగిందని, ఈ కాలంలో విచారణలు మరియు ధృవీకరణలు చేసి, తుది ఓటర్ల జాబితా ఏప్రిల్ మాసం 2026న ప్రచురించ బడుతుందన్నారు. ఈ రోజు నాటికి నియోజక వర్గాలు వారీగా ఎలక్టర్ల మ్యాపింగు ఇలా ఉన్నాయని తెలిపారు. నూజివీడు 56.55, దెందులూరు 58.38, ఏలూరు 59.47, కైకలూరు 59.69, ఉంగుటూరు 60.12, పోలవరం 60.16, చింతలపూడి 69.11 మొత్తం 60.72 శాతం ఎలక్టర్ల మ్యాపింగులు అయ్యాయని, లక్ష్యాలను సాధించి పూర్తిస్థాయిలో నివేదికకు అందించాలని ఆదేశించారు. జిల్లాలో 7 నియోజకవర్గాలు పరిధిలో ఫారం 6 ధరఖాస్తులు 380, ఫారం 7 ధరఖాస్తులు 389, ఫారం 8 ధరఖాస్తులు 438 మొత్తం 1207 పెండింగ్లో ఉన్న ధరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

