పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి నూతన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి
1 min read

జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమీక్ష
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో గురువారం జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమలు ప్రగతిని, పెండింగ్లో ఉన్నవి, భవిషత్తు కార్యాచరణను మండలాలు, గత సమావేశంలో జరిగిన అంశాలు వాటిపై తీసుకున్న చర్యలుపై మండలాలు, శాఖలు వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎం ఎఫ్ఎంఈ పథకం కింద 168 లక్ష్యానికి గాను 176 ధరఖాస్తులు రాగా ఇందులో 67 గ్రౌండింగు చేయడం జరిగిందని అన్నారు. ఇందులో రూ 749.57 లక్షలు రూపాయలతో 161 యూనిట్లు గ్రౌండింగు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న తరహా, మధ్యతరహా వివిధ వర్గాలకు సంబంధించి ఔత్సాహికులకు ప్రోత్సహించే దిశగా 9 యూనిట్లకు గాను రూ 51.57 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమలు కేంద్ర జియం ఆర్.వెంకట రావు, ఐటిడిఏ పివో కె.రాములు నాయక్, ఏపి ఫెడరేషన్ చాంబర్ ఆఫ్ కామర్స్ పరిశ్రమలు వైస్ ప్రెసిడెంటు వంకాయల రామకృష్ణ, జిల్లా విద్యుత్తు శాఖ యస్ ఇ పి.సల్మాన్ రాజు, జిల్లా గ్రౌండు డిడి పైలా కోదండరామ్, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాషా, ఏపి ఐఐసి జోనల్ మేనేజరు కె.బాబ్జీ, డిఆర్డిఏ పిడి టి.వి. విజయలక్ష్మి, జిల్లా పంచాయతీశాఖ అధికారి కె.అనురాధ, జిల్లా స్కిల్ డెవలప్మెంటు అధికారి యన్. జితేంద్రబాబు, యల్డియం డి.నీలాద్రి, మత్స్య శాఖ ఇంచార్చి డిడి బి.రాజ్ కుమార్, సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


