ఘనంగా భాష్యం పాఠశాలలో బ్రాంచ్ వార్షికోత్సవ వేడుకలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక కర్నూలు శంకలబాగ్ భాష్యం పాఠశాలలో బ్రాంచ్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కర్నూల్ లోని విశ్వక్ గార్డెన్స్ లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ ని రాయలసీమ జోనల్ ఇన్చార్జ్ అయిన అనిల్ కుమార్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ మరియు హెచ్ఎం మాధవి సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులను తల్లిదండ్రులని ఉద్దేశించి టీజీ వెంకటేష్ భాష్యం విద్యా సంస్థలు విద్యార్థులకు క్రమశిక్షణ కూడిన విద్యను అందిస్తున్నారని తెలిపారు మరియు కర్నూలు పట్టణంలో విద్యతో పాటు క్రీడల్లోనూ అలానే సాహిత్య కార్యక్రమంలో భాష్యం పాఠశాల ముందుండి నడిపిస్తున్నారని చెప్పారు ఈ సందర్భంగా టౌన్ మోడల్ లో భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ మీద కట్టిన ఆడిటోరియం ని గుర్తు చేశారు. ఈ వార్షికోత్సవంలో జీ అనిల్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు కర్నూలు భాష్యం పాఠశాలకు ఎంతో తోడ్పడి ముందుండి ప్రతి విషయంలో సహకరిస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీ వెంకటేష్ విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు ఈ కార్యక్రమం విద్యార్థులు చేసిన సాహిత్య కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని అభినందించారు.


