NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి..

1 min read

యుద్ధం వద్దు శాంతి ముద్దు-…….

న్యూస్ నేడు పత్తికొండ : ప్రపంచంలో అమెరికా  సామ్రాజ్యవాద దాహం, సహజ వనరులు ఉన్న దేశాలపై ఆధిపత్యం చలాయించడం కొరకు మొదలుపెట్టిన  యుద్దాలు ప్రపంచ శాంతిని మంటగలుపుతున్నాయని, ఆధిపత్యం కొరకు జరుగుతున్న యుద్ధాల  వలన  భారీగా పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలనీ సిపిఎం జిల్లా నాయకులు బి.వీర శేఖర్, మండల కమిటీ  సభ్యులు మహబూబ్ బాషా అశోక్ లు  డిమాండ్ చేశారు. సోమవారం  మండలంలోని తెర్నేకల్ గ్రామంలో సిపిఎం కార్యాలయం ముందు ఆ పార్టీ శాఖ సమావేశం గ్రామ నాయకులు సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వీరశేఖర్ మాట్లాడుతూ,  అమెరికా సామ్రాజ్యవాదం పాఠశాలల పైన ఆస్పత్రులు నివాస ప్రాంతాల పైన  దాడి చేసి అమాయకుల ప్రాణాలు తీయడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించాలని, అలాగే యుద్ధం కారణంగా పెరిగిన వంట గ్యాస్ ధర, కమర్షియల్ గ్యాస్  లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాబోయే పెట్రోల్ ఉత్పత్తులు ఆయిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు,  అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్న యుద్ధాన్ని ఆపడానికి భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, సహజ మిత్రులను వదిలిపెట్టి సామ్రాజ్యవాద కాంక్షతో రగులుతున్న  ట్రంప్ కు మద్దతుగా వ్యవహరించడం మన దేశానికి ముప్పు అని పేర్కొన్నారు, భారతదేశానికి ఉపయోగపడే ఇరాన్ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరైనది కాదని తెలిపారు. గ్యాస్ ధరలు పెరగడం ద్వారా ప్రజల పైన ఇతర వినియోగదారుల పైన భారీగా భారాలు పడి ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు మహబూబ్ బాషా,పరమేష్, శాఖ సభ్యులు దొడ్డప్ప రవీంద్రా లింగన్న బడే సాబ్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author