రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన
1 min read

డి ఎస్ డి ఓ భూపతి రావు
కర్నూలు , న్యూస్ నేడు: ఈ నెల 11 నుంచి 13 వ తేదీ వరకు నూజివీడు లో జరిగే రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీలకు ఎంపికైన విద్యార్థులను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ భూపతి రావు అభినందిచారు. సోమవారం కర్నూలు స్టేడియం లో అర్చరీ పోటీలకు వెళ్తున్న విద్యార్థులకు టీ షర్ట్ లు అందజేశారు. ఈ సందర్బంగా డి ఎస్ డి ఓ భూపతి రావు మాట్లాడుతూ…. సాంప్రదాయ క్రీడ గా పేరొందిన విలు విద్య ను… ఆది మానవుడు జంతువుల వేట కోసం ఆడే వారన్నారు. మహా భారతం, రామాయణం లోను విలు విద్య తోనే విజయాలు సాధించారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. దేశం లో ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే అవార్డు అర్జున అవార్డు అని, ఉత్తమ కోచ్ లకు ఇచ్చే అవార్డు ద్రోణ చార్య అవార్డు అని పేర్కొన్నారు. కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా విలు విద్య సంఘం కార్యదర్శి నాగ రత్నమయ్య, సునీల్, భారత్, లతా , సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

