NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవించాలి

1 min read

రావలసిన గౌరవ వేతనం చెల్లించకుంటే వచ్చే మండల పరిషత్ సమావేశాన్ని వాకౌట్ చేస్తాం

ఎంపీపీ  పెన్మెత్స శ్రీనివాసరాజు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మూడునెలలకు ఒకసారి జరిగే మండల సర్వ సభ్య సమావేశానికి అధికారులు రానప్పుడు సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని అధికారులపై, సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు మండల పరిషత్ కార్యాల యంలో మంగళవారం  మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పెన్మెత్స శ్రీనివాసరాజు అధ్యక్షతన నిర్వహించారు. ప్రధాన శాఖల అధికారులు,సమావేశానికి హాజరుకాకపోవడంతో  మండిపడ్డారు. ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వకుండా, ప్రోటోకాల్ పాటించకుండా,అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని , జాలిపూడి, శ్రీపర్రు, మల్కాపురం సర్పంచులు  సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.  సమావేశం ప్రారంభమయ్యాక కూడా అధికారుల, ప్రజాప్రతినిధుల రాక కొనసాగింది. పలుశాఖల ద్వారా జరిగే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల  ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఎంపీపీ శ్రీనివాసరాజు మాట్లాడుతూ, గ్రామాల్లో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవించాలన్నారు, ఎంపీటీసీలకు రావాల్సిన గౌరవ వేతనం చెల్లించాలని లేకుంటే వచ్చే మండల పరిషత్ సమావేశాన్ని వాకౌట్ చేస్తామని హెచ్చరించారు, ఎమ్మెల్యేలు, ప్రతినెల జీతాలు తీసుకుంటున్నారని, స్థానిక ప్రజా ప్రతినిధులకు నెలకు కేవలం 3వేలు ఇవ్వలేకపోవడం శోచనీయమన్నారు, సర్పంచుల పదవీకాలం ఈనెలఖరితో మూవీ ఉండడంతో, పలువురు సర్పంచులను  ఘనంగా సత్కరించారు,రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి , ఎంపీడీవో జనార్దన్,తదితరులు పాల్గొన్నారు. అనంతరం విచ్చేసిన సర్పంచ్ లకు మహిళా దినోత్సవన్ని పురస్కరించుకొని మహిళా సర్పంచులకు దుస్తులు పంపిణీ చేసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సర్పంచులoదరు కలసి కృతజ్ఞతగా ఎంపీపీ శ్రీనివాస్ రాజు కి శాలువాకప్పి, పూల బోకే అందించి, శ్రీకృష్ణుని ప్రతిమను బహూకరించి సత్కరించారు.

About Author