NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు తక్షణం నెరవేర్చాలి

1 min read

ప్రజల సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ చేసే ఉద్యమాలకు చేయూతనివ్వండి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా జరుగుతున్న గడప గడపకు సిపిఐ పార్టీ ఉద్యమ నిధి సేకరణ కార్యక్రమంలో  పవర్ పేట రైల్వే స్టేషన్ నుండి ఆర్ఆర్ పేట మెయిన్ రోడ్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలందరికీ అనేక హామీలు ఇచ్చి అధికారం పొందిన తర్వాత ఆ హామీల అమలకు ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రజలకు కనీసం సొంత ఇల్లు నిర్మాణానికి సైతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. విద్యార్థులు యువజనలకు నాణ్యమైన విద్య ఉపాధి కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిన మెడికల్ మాఫియాను నియంత్రించడంలో అలసత్వం వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ భూములను దారాదత్తం చేస్తూ వారికి మేలు చేసే విధంగా ప్రభుత్వం రాయితీలను కల్పించడం దారుణం అన్నారు. పేదవాడికి సొంత ఇంటిని దక్కించడం కోసం మార్చి 24వ తేదీన ఇల్లు,ఇళ్ల స్థలాల అంశంపై సిపిఐ చేసే పోరాటాలని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ సహాయ కార్యదర్శులు కురెళ్ళ వరప్రసాద్, అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా, కార్యవర్గ సభ్యులు మావూరి విజయ,గొర్లి స్వాతి,కొల్లూరి సుధారాణి, కొండేటి బేబీ,శాయన అభిలాష్ కుమార్ కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు, లక్కోజు జగదీశ్వరి,అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగే, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి శివకుమార్, సిద్దు, ఉప్పులూరి భవాని,ఉప్పులూరి రాజమణి, జోజి మేరీ, దొండపాటి తులసి,రంగమ్మ, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author