పెద్ద హ్యాట గ్రామంలో చెత్త సేకరణ బుట్టల పంపిణీ
1 min read

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలం పెద్ద హ్యాట గ్రామంలో గ్రామ పరిశుభ్రతను మెరుగుపరచడం లక్ష్యంగా చెత్త సేకరణ బుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని గ్రామ ప్రజలకు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా బుట్టలలో వేయాలని సూచించారు.గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు తెలిపారు. చెత్తను సక్రమంగా సేకరించడం ద్వారా గ్రామంలో శుభ్రత పెరుగుతుందని, ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

