పోలీస్ స్టేషన్ కు చేరిన ‘పది’ ప్రశ్న పత్రాలు
1 min read

పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి:ఎంఈఓ లు
న్యూస్ నేడు మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో ఈనెల 16 నుండి ఏప్రిల్ ఒకటి వరకు జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మిడుతూరు మండల విద్యాశాఖ అధికారులు ఫైజున్నిసా బేగం,మల్లికార్జున నాయక్ బుధవారం అన్నారు.పదవ తరగతి ప్రశ్నాపత్రాలు మంగళవారం సెట్-1 పేపర్, బుధవారం సెట్-2 పేపర్ ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్ లో అధికారులు భద్రపరిచినట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా ఎంఈవో లు మాట్లాడుతూ మండలంలో పదవ తరగతి పరీక్షలు మూడు కేంద్రాల్లో జరుగుతాయని మండలంలో మొత్తం 146 మంది విద్యార్థులు రాస్తుండగా వారిలో మిడుతూరు మోడల్ స్కూల్లో-135, మిడుతూరు జడ్పి.హెచ్ఎస్ లో-146,కడుమూరు జడ్పీహెచ్ఎస్ లో-135 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని అన్నారు.అదేవిధంగా విద్యార్థులకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవోలు తెలిపారు.

