ఎంపీహెచ్ఇఓ నల్లి రవికుమార్ పై భౌతిక దాడి చేయడం అమానుషం
1 min read

రాష్ట్ర ఎంపీహెచ్ఈఓ జిల్లా అధ్యక్షులు నెరుసు రామారావు
ఉద్యోగులపై దాడి చేయడం హేయమైన చర్య
ఏలూరు జిల్లా ఎంపీహెచ్ఇఓ జిల్లా అధ్యక్షులు జె.గోవిందరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా డి ఎం హెచ్ ఓ కార్యాలయంలో భోజన విరామసమయంలో ఎంపీహెచ్ ఈ ఓ.సంఘం ఆధ్వర్యంలో నిన్న శ్రీకాకుళం జిల్లా పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య విస్తరణాధికారిగా ఎంపీహెచ్ ఈ ఓ గా పని చేస్తున్న నల్లి రవికుమార్ పై భౌతిక దాడిచేయడాన్ని అమానుష చర్యగా పరిగణిస్తూ ఏలూరు జిల్లా ఎం పి హెచ్ ఈ ఓ సంఘపక్షంగా తీవ్రంగా నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీ హెచ్ ఈ ఓ సంఘ ఉపాధ్యక్షులు నెరుసు వెంకట రామారరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులపై ప్రజలు దాడి చేయడం సర్వసాధారణం అయినది సాక్షాత్తు వైద్య ఆరోగ్యశాఖలో ఏఏన్ యమ్ గా పనిచేస్తున్న కమల తన కుటుంబ సభ్యుల్ని, సంఘ సంఘ వ్యతిరేక శక్తులను తీసుకొని వచ్చి విధి నిర్వహణలో మీటింగ్ లో ఉన్న నల్లి రవికుమార్ ను దారుణంగా కొట్టి గాయపరచడం కాకుండా దారుణంగా దుర్భాషలాడం చాలా దారుణం అని దోషులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నరు. ఏలూరు జిల్లా ఎం పి హెచ్ ఈ ఓ సంఘ అధ్యక్షులు జె.గోవిందరావు మాట్లాడుతూ భౌతికదాడి చేయడం హేయమైన చర్య అని, ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్రమై విచారణ జరిపి, తక్షణమే దోసులను శిక్షించాలని, మనం అందరము వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులమని, అందరూ కలిసిమెలిసి పనిచేయాలని, ఈ విధంగా బౌద్ధ దాడి చేయడము మన డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరుని దాడిచేసినవారిని తక్షణమే నాన్ బెయిల్బుల్ వారంట్ మీద అరెస్ట్ చేయాలి అని కోరారు.ఈ ఆందోళన కార్యక్రమంలో సంఘ జిల్లా సహధ్యక్షులు ఇ.రవికుమార్ జిల్లా కార్యదర్శి ఏన్. ప్రసాద్ ఎం పి హెచ్ ఈ ఓ లు చిత్తా. శ్రీనివాస్, శీను బాబు నాగరాజు తదితరులు పాల్గొని ఆందోళన తెలియజేసారు.

