NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ పారిశ్రామిక విధానాల‌ను ప‌క్క రాష్ట్రాల ప్ర‌జాప్రతినిధులు మెచ్చుకుంటున్నారు..

1 min read

ప‌రిశ్రమ‌ల శాఖ‌ మంత్రి టీజీ భ‌ర‌త్

కర్నూలు, న్యూస్​ నేడు: ఏపీలో కూట‌మి ప్రభుత్వం తీసుకొచ్చిన‌ పారిశ్రామిక‌ విధానాల‌ను ప‌క్క రాష్ట్రాల ప్రజాప్రతినిధులు సైతం మెచ్చుకుంటున్నారని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ ఒక ప్రక‌ట‌న‌లో పేర్కొన్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఓ కార్యక్రమంలో క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, తెలంగాణ ప్రజా ప్రతినిధులతో క‌లిసి తాను కూడా పాల్గొన్నట్లు టీజీ భ‌ర‌త్ చెప్పారు. అయితే ఆ సంద‌ర్భంగా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించిన‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పెట్టుబ‌డులు పెట్టాల‌న్నా, ఏ రంగంలో పెట్టుబ‌డులు పెట్టాల‌న్నా సింగిల్ విండో ద్వారా వెంట‌నే అనుమ‌తులు మంజూరు చేస్తామ‌ని వివ‌రించిన‌ట్లు చెప్పారు. ఇదే విష‌యాన్ని అక్కడ ఉన్న క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన‌ ఎం.ఎల్.సి డి.ఎస్ అరుణ్ క‌ర్ణాట‌క‌లో విధాన ప‌రిష‌త్‌లో ప్రస్తావించార‌ని టీజీ భ‌ర‌త్ చెప్పారు. అయితే క‌ర్ణాట‌క‌లో పారిశ్రామిక‌వేత్తల‌కు అనుకూల ప‌రిస్థితులు లేవ‌ని ఆ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులే స్వయంగా చెబుతున్నారన్నారు. విజ‌న‌రీ లీడ‌ర్ సీఎం చంద్రబాబు నాయుడు నాయ‌క‌త్వంలో ఏపీలో పారిశ్రామిక‌వేత్తల‌కు పూర్తి అనుకూల‌మైన వాతావ‌ర‌ణం క‌ల్పించామ‌న్నారు. ఏపీలో అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కూట‌మి ప్రభుత్వం ప‌నిచేస్తుందని టీజీ భ‌ర‌త్ పేర్కొన్నారు.

About Author