శ్రీ శిరిడి సాయి మందిర్ ఆధ్వర్యంలో నూతన ప్రసాదాలయం ప్రారంభోత్సవం
1 min read

ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి,మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక ఆదివారపుపేటా శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించినశ్రీ షిరిడి సాయి ప్రసాదాలయం ఏలూరు ఎమ్మెల్యే బడేటి శనివారం ప్రారంభించారు. ప్రేమ సాయి పారాయణ నిలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య తో కలసి పాల్గొన్న నగర పాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్, నగరపాల సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి,ఈ డా చైర్మన్, మాజీ కార్పొరేటర్ సీనియర్ టిడిపి నాయకులు ఇసుకపల్లి తాతారావు (ఐటిఆర్) ఈ శ్రీ శిరిడి సాయి ప్రసాదాలయం భవన నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపటం అభినందనీయమన్నారు.ఐ టి ఆర్ కుటుంబ సభ్యులకు, కమిటీ నిర్వాహకులకు, విరాళాలు అందించిన దాతలకు ఆ షిరిడి సాయి నాధుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయన్నారు.


