జగద్జ్యోతి బసవేశ్వర విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ
1 min read

హోళగుంద, న్యూస్ నేడు: మండల కేంద్రంలో సోమవారం స్థానిక తేరుబజార్ నందు శ్రీ జగద్జ్యోతి బసవేశ్వర విగ్రహ ప్రతిష్ఠాపనకు వీరశైవ లింగాయత్ కులస్తులు భూమిపూజ చేపట్టారు.ముఖ్యంగా ఏప్రిల్ 20న బసవ జయంతిని పురస్కరించుకుని హోళగుంద గ్రామంలో శ్రీ జగద్జ్యోతి బసవేశ్వర విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ వీరశైవ సంఘం గౌరవ అధ్యక్షులు శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గవి సిదప్ప దొడ్డ బసప్ప టీచర్ రాజా శ్రీకాంత్ వీరభద్ర గౌడ సిద్దేశ్ వీరేష్ తిప్పన వీరభద్రస్వామి వీరశైవ లింగాయత్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

