ఇరాన్ పై అమెరికా దాడికి వ్యతిరేకంగా సిపిఐ నిరసన ర్యాలీ
1 min read

న్యూస్ నేడు పత్తికొండ : సామ్రాజ్య కాంక్షతో అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ పై సంయుక్తంగా నిర్వహిస్తున్న దాడులకు వ్యతిరేకంగా సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో మద్దికేర మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టింది. అమెరికా ఇజ్రాయిల్ సముక్తంగా చేస్తున్న దాడిని ఖండించాలని, అమెరికా సామ్రాజ్య వాధం నశించాని నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేశారు. ఇరాన్ పై చేస్తున్న యుధ్ధాన్ని అపాలని,ప్రపంచ శాంతి వర్థిలాలని నిరసన కారులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు రాజా సాహెబ్, స్థానిక సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

