20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి టీజీ భరత్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో మౌర్య ఇన్‌లోని ఆయన కార్యాలయంలో పార్టీ క్యాడర్‌తో కలిసి మంత్రి టీజీ భరత్.. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ మాటిచ్చిన విధంగా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామన్నారు. విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో హమీ ఇచ్చిన మేరకు 20 లక్షల ఉద్యోగాలు తప్పకుండా కల్పిస్తామన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్‌తో కలిసి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు టీజీ భరత్ చెప్పారు.

