ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత
1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు 16 అర్జీలు
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి రోజూ ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించాలని కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కాలనీలకు సంబంధించి 16 ఫిర్యాదులను స్వీకరించిన కమిషనర్, సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, ఎస్‌ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్ బాబు, ఎంఈ మనోహర్ రెడ్డి, మెప్మా పిడి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

