ఇద్దరు హోంగార్డ్స్ కు వెల్ఫేర్ ఫండ్ చెక్కులు అందజేత
1 min read

హోంగార్డు కమాండెంట్ శ్రీ యం. మహేష్ కుమార్
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు హోం గార్డ్స్ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను జిల్లా పోలీసు కార్యాలయంలోని హోంగార్డు కమాండెంట్ కార్యాలయంలో సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ శ్రీ యం. మహేష్ కుమార్ ఇద్దరు హోంగార్డులకు సోమవారం అందజేశారు.మెడికల్ గ్రాంట్ క్రిందకర్నూలు యూనిట్ కు చెందిన హోం గార్డు పి. సురేష్ కుమార్ కు రూ. 10 వేలు, మహిళా హోం గార్డు వి. భారతి కి రూ. 10 వేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో హోంగార్డు ఇంచార్జ్ కర్నూలు యూనిట్ శ్రీ ఎస్.ఎల్.కాంతరెడ్డి , జూనియర్ అసిస్టెంట్ శ్రీమతి కె. మాధవి రాణి, పోలీసు సిబ్బంది మరియు హోం గార్డ్స్ పాల్గొన్నారు.

