ఘనంగా శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ 7వ వార్షికోత్సవం
1 min read

వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు
ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బడేటి దంపతులు,కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక ఆదివారపు పేటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర్ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించు కుని ఆదివారం ఘనంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వ హించారు. ఈ సందర్భంగా భక్తి భావంతో కూడిన వాతా వరణంలో వేలాదిమంది భక్తులకు మహా అన్నదానం కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య హాజరై, నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తో కలిసి మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా దేవాలయంలో ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించి,శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులు నగర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. అనంతరం సాయి బాబా చిత్రపటానికి పుష్పార్చనలు చేసి నివాళులర్పించారు. ఆలయ ప్రాంగణం పూలతో,దీపాలతో కన్నుల పండుగ వాతావరణని తలపించి అలంకరించబడ్డాయి. భక్తులు భారీగా తరలి వచ్చి తీర్థ ప్రసాదాలు అందుకుని శ్రీ శిరిడి ప్రేమ సాయిని దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ, సమాజంలో సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని, ముఖ్యంగా అన్నదానం మహాదానం అని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించి సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ సాయి బాబా బోధనలు మానవతా విలువలను పెంపొందించే విధంగా ఉంటాయని అన్నారు. ఈ ఆలయంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ పున:నిర్మాణ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు (ఐటిఆర్) మరియు ఆలయ కమిటీ సభ్యులు,స్థానిక నాయకులు,భక్తులు,మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కార్యక్రమం మొత్తం భక్తి శ్రద్ధల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించబడిందని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.


