NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెవ. డా: ప్రవీణ్ పగడాల ప్రధమ జ్ఞాపకార్ధక ప్రత్యేక ప్రార్థనలు

1 min read

ఏలూరులో క్రైస్తవ ఐక్యత కోసం ఘన కార్యక్రమం

పెద్ద ఎత్తున పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన దైవజనులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ (యుసిపిఐసి) వ్యవస్థాపకులు డాక్టర్:కోలా ప్రసాద్  సహకారంతో ఏలూరులో ఒక గొప్ప ఆధ్యాత్మిక సమావేశం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ఏలూరు(ఇసిపిఫ్) పాస్టర్స్ ఆధ్వర్యంలో స్థానిక నరసింహారావు పేట ఇండోర్ స్టేడియం ఎదురుగా లేడీస్ క్లబ్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. విచ్చేసిన అందరూ కలిసి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలని హర్షదనులతో  పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన  దైవజనులు అందరిచే  దేవుని వాక్యంతో సభను ఆశీర్వదించారు.అలాగే ఈ సమావేశంలో అనేక మంది సంఘ పెద్దలు, ఆధ్యాత్మిక నాయకులు పెద్ద ఎత్తున  పాల్గొని కార్యక్రమానికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చారు. రెవ,డాక్టర్: పగడాల ప్రవీణ్ ప్రధమ జ్ఞాపకార్థంగా ఘనంగా నివాళులు అర్పించి  ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆయన ఆత్మ దైవ సన్నిధి చేరాలని మౌనం పాటించారు.సభ అంతటా దేవుని స్తుతి, ప్రార్థనలు మిన్నంటాయి,పలు ప్రాంతాల నుండి వచ్చిన దైవ సేవకుల సందేశాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమాన్ని దేవుడు ఘనంగా నడిపించాడని నిర్వాహకులు తెలిపారు. విచ్చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author