NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టణంలో ఘనంగా కళాకారుల దినోత్సవం

1 min read

హాజరైన మున్సిపాలిటీ కమిషనర్ అండ్​ మాండ్ర

న్యూస్ నేడు నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో రంగస్థల కళాకారులను ఘనంగా సత్కరించారు.పట్టణంలో జై కిసాన్ పార్క్ లో శనివారం ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్బంగా నందికొట్కూరు తాలుకా రంగస్థల కళాకారుల కమిటీ ఆధ్వర్యంలో కళాకారుల దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకట రామిరెడ్డి మరియు నందికొట్కూరు టీడీపీ మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా కళాకారుల యొక్క సేవలను వారు కొనియాడారు.తర్వాత కళాకారులు అయిన మాల మహానాడు రాష్ట్ర నాయకులు డి జయ రాముడు,ఖాదర్ భాష, దావీదు,పగడ్యాల సాక్షి పాత్రికేయులు పక్కిరయ్య, శీను,వేణుగోపాల్,మాల మహానాడు జిల్లా నాయకులు డాక్టర్ రాజులను కమిషనర్ మరియు సురేంద్ర నాథ్ రెడ్డి శాలువా,పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

About Author