స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నేడు స్థానిక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (GGH)లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ నెల కార్యక్రమం ప్రధాన థీమ్ అయిన “జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్” (Zero Waste Institutions) పై ప్రత్యేక దృష్టి సారించి, భారీ అవగాహన ర్యాలీ మరియు ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.ఆసుపత్రి ప్రాంగణంలోని క్యాజువల్టీ విభాగం నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ గైనెక్ వార్డు వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న ఆసుపత్రి సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు బ్యానర్లు ప్రదర్శిస్తూ, “మన చెత్త – మన బాధ్యత” అనే నినాదాలతో రోగులు మరియు వారి సహాయకుల్లో చైతన్యం నింపారు. ర్యాలీ అనంతరం, గైనెక్ వార్డు ప్రాంగణంలో అధికారులు మరియు నర్సింగ్ విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఆసుపత్రి పరిసరాలను పచ్చదనంతో నింపి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో ఈ ప్లాంటేషన్ చేపట్టారు.ఎమర్జెన్సీ వార్డు ముందు, తడి చెత్త, పొడి చెత్త మరియు ప్రమాదకరమైన బయో-మెడికల్ వ్యర్థాలను వేర్వేరు రంగుల డబ్బాల్లో వేయడం యొక్క ఆవశ్యకతను నర్సింగ్ విద్యార్థులతో పాటు శానిటేషన్ సిబ్బంది మరియు ప్రజలకు ప్రత్యక్షంగా వివరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డా లక్ష్మీ భాయి ,CSRMO డా పద్మజ, డిప్యూటీ CSRMO డా పద్మజ , అడ్మినిస్ట్రేషన్ అధికారులు సింధు సుబ్రహ్మణ్యం, డా వెంకట రమణ, డా శివ బాల, డా కిరణ్ కుమార్, డా సునీల్ ప్రశాంత్ లతో పాటు నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రి భాయి, అలాగే నర్సింగ్ విద్యార్థినిలు మరియు ఇతర ఆసుపత్రి సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

