వేసవి లో పంటల రక్షణ, ఎల్నినో ప్రభావం తో పంటల సాగు అంశాలపై సమీక్ష
1 min read

రైతులకు ఆదాయం నిరంతరం ఉండాలి
ఉద్యాన పంటల సాగు పెంచాలి
ఎఫ్ పి ఓ లు పెంచాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి
కర్నూలు, న్యూస్ నేడు : ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో అందుకనుగుణంగా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.శనివారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో వ్యవసాయ, ఉద్యాన, ఫిషరీస్ అనిమల్ హుస్బేండ్రి మైక్రో ఇరిగేషన్, సెరికల్చర్ అధికారుల తో వేసవి లో పంటల రక్షణ, ఎల్నినో ప్రభావం తో పంటల సాగు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ వేసవిలో , ఎల్ ని నో ప్రభావంతో రైతుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఆదాయం నిరంతరం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఉద్యాన పంటల సాగు పెంచాలన్నారు. మిశ్రమ పంటల ప్రోత్సాహం, ఎఫ్ పి ఓ ల సభ్యుల సంఖ్య పెంచడంపై దృష్టి పెట్టాలన్నారు. ఉల్లి సాగు తగ్గించి, మల్లెపూల సాగు పెంచాల న్నారు. రైతుల దగ్గర పాలిచ్చే పశువులు , పొట్టేలు, మేకలు పెంచే చర్యలు తీసుకోవడం ద్వారా వారికి అదనపు ఆదాయం వచ్చే చర్యలు తీసుకోవాలని, వారి పశువులకు అవసరమైన గడ్డి, దాణా సరఫరా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో పశువుల నీటి తొట్టెలు నీటితో నింపే చర్యలు తీసుకోవాలని, నీటిని పొదుపుగా వాడే డ్రిప్ ఇరిగేషన్ గణనీయంగా పెంచాలని , రైతులు ప్రకృతి వ్యవసాయం వైపుకు మొగ్గుచూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతులకు పంట రుణాలు, పశువులకు రుణాలు ఇప్పించడం ద్వారా వారు నిరంతరం ఆదాయం పొందే లాగా చర్యలు తీసుకోవాలని,ఎప్పటికప్పుడు రైతు పొలాల భూసార పరీక్షలు నిర్వహించి వారి పొలాలకు సరిపోయే పంటలను పండించే చర్యలు తీసుకోవాలన్నారు. పంట ఉత్పత్తులకు సరైన గిడ్డంగులు , మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించే చర్యలు తీసుకోవాలని, తద్వారా రైతులు నష్టాల నుండి లాభాల వైపు వెళ్లే విధంగా చర్యలు ఉండాలని ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డ్రోన్ల సహాయంతో రైతులకు మరింత సేవలు అందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వరలక్ష్మి, జెడి అనిమల్ హస్బండ్రీ హేమంత్ కుమార్ , మత్స్యశాఖ డిడి రంగనాథ్, హార్టికల్చర్ అధికారి రాజా కృష్ణ రెడ్డి తాము చేస్తున్న మరియు చేయబోతున్న పద్ధతులు, తద్వారా రైతుకు జరిగే లాభాలను వివరించారు. న్యాచురల్ ఫార్మింగ్ డిపిఎం మాధురి హాఫ్ మూన్ ద్వారా వ్యవసాయ పద్ధతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్త రాఘవేంద్ర , డి డబ్ల్యు ఎం ఏ మాధవి, సహాయ అగ్రికల్చర్ అధికారులు మరియు ఇతరులు హాజరయ్యారుఈ సమావేశానికి జెడి అగ్రికల్చర్ వరలక్ష్మి , జేడీ అనిమల్ హుస్బేండ్రి హేమంత్ కుమార్ , డిడి ఫిషరీస్ రంగనాథ్ , డి డి మార్కెటింగ్ గద్వాల రాజు,ఏపీఎంఐపి పిడి సుధాకర్, రూరల్ ఏ డి సాలు రెడ్డి,డిడి సెరికల్చర్ ఆంజనేయులు , ఉద్యాన శాఖ అధికారి రాజకృష్ణ రెడ్డి , డిడి సాయిల్ కన్జర్వేషన్ , అగ్రికల్చర్ ఏ డి లు, ఏ ఓ లు, వెటర్నరీ డాక్టర్ లు హాజరు అయ్యారు.

