ఏలూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక
1 min read

ఘనంగా ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధమ మహాసభ
ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే బడేటి చంటి, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు
జర్నలిస్ట్ సేవలు మరువలేనివి ఎమ్మెల్యే బడేటి
ఏపీ బీజేఏ అధ్యక్ష కార్యదర్శుగా పి.నారాయణ,ఎం.కిరణ్.
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ క్రాఫ్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీ బి జె ఏ) ఏలూరు జిల్లా మహాసభను ఏలూరులోని పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం భవనంలో సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శు ఎస్.డి.జబీర్, వై.వి.హరీష్ అధ్యక్షతన మహాసభలు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేనివని కొనియాడారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ లు ఏ ఆపదలో ఉన్న ముందుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ యూనియన్ సభ్యులు స్పందించి వారికి తగిన సహకారం అందించడంలో ముందు ఉండటం ఎంతో సంతోషకరమంటూ ఆయన యూనియన్ సభ్యులను కొనియాడారు.వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని కేంద్ర రద్దుచేసిందన్నారు. జర్నలిస్టులను దిగజార్చడానికే నేషనల్ మీడియా కౌన్సిల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో వర్కింగ్ జర్నలిస్టులకు ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. ఆర్ ఎన్ ఐ ను మార్చివేసి పి ఆర్ జి ఐ ను ఏర్పాటు చేసిందని అన్నారు. “బలమైన, స్వతంత్ర విధానం లేకుండా ప్రజాస్వామ్యం సజావుగా నడపదని ఆయన ఆవేద వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు అందరూ ఎదుర్కొంటున్న సమస్యలను
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ సీనియర్ నాయకులు బాలశౌరి, ఇక్కడేషన్ కమిటీ సభ్యులు శంకర్రావు, కళ్యాణ్,మహా న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ ఎం.భరత్,బి ఆర్ కే న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ కే.బ్రహ్మం, 99 టీవీ స్టాఫ్ రిపోర్టర్ రాంబాబు, మెగా 9 టీవీ స్టాప్ రిపోర్టర్ చైతన్య, స్వతంత్ర టీవీ స్టాఫ్ రిపోర్టర్ సంజయ్, క్రైమ్ రిపోర్టర్ ఊర్ల శీను, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏలూరు జిల్లా యూనియన్ నాయకులు సోమశేఖర్ , ప్రతాప్, శరత్,జయరాం,సజ్జి మేథ్యూస్, యర్రా.జయదాస్,మిల్టన్ ప్రతాప్,సతీష్ , సిహెచ్ శ్రీనివాస్, దొరబాబు,తదితరులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గంఏలూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నికలు సోమవారం పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం భవనంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పెంట నారాయణ, ఎం. కిరణ్ ఏకగ్రీవంగా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకున్నారు. పి.సుమన్, డి.సత్యనారాయణ ను ఉపాధ్యక్షులుగా, డి.దాస్ ను కోశాధికారి గా, భాషను సహాయ కార్యదర్శిగా మరో 9 మందితో ఈసీ సభ్యులతో కూడిన కార్యవర్గాన్ని ఎన్నికయ్యారు.

