NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

2న తర్తూరు రంగనాథ స్వామి రథోత్సవం

1 min read

దేవాలయానికి ప్రత్యేకంగా అలంకరణ

భారీగా తరలి రానున్న రైతులు ప్రజలు

అన్ని ఏర్పాట్లు పూర్తి:ఈవో సాయికుమార్..

న్యూస్ నేడు నందికొట్కూరు: శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి తిరుణాల అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచినది.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తర్తూరులో ఏప్రిల్ 2వ తేదీ గురువారం సా రథోత్సవ కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏ సాయికుమార్ అన్నారు.ఈరోజు మంగళవారం గరుడ వాహనం,రేపు 1వ తేదీ గజవాహనం,రెండవ తేదీ సాయంత్రం రథోత్సవం,3వ తేదీ శుక్రవారం అశ్వవాహన సేవ పారువేట,4న వసంతోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఎక్కడా లేనివిధంగా ఈ తిరుణాల రైతులకు ఎంతగానో ఉపయోగంఆలయ మరియు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా అలంకరణతో తీర్చిదిద్దారు. ఈ తిరుణాల దాదాపుగా నెల రోజులపాటు జరగనుంది.ఈ జాతర అంటే ఎంతో ప్రసిద్ధిగాంచినది. సాధారణంగా అన్ని జాతరలో విగ్రహాలు,ఊరేగింపులు, రథోత్సవాలు జరిగితే ఏ జాతరలో వాటితో పాటుగా రైతులు వ్యవసాయ పనిముట్ల కొనుగోలు మరియు ఎద్దుల కొనుగోలు అంతేకాకుండా ఇండ్లల్లో ఉండే వస్తువులు మరియు చిన్నారులకు అవసరమైన ఆట వస్తువులు ప్రజలకు అందుబాటులో విశేషంగా ఉండడం ఆనవాయితీ..మహిళలు, చిన్నారులు,రైతులు వచ్చి జాతరను తిలకించిన అనంతరం వాటి కొనుగోలుకు ఎంతగానో ఆసక్తి చూపుతారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి:ఈవో

తిరుణాలలో ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో సాయికుమార్ సోమవారం సాయంత్రం తెలిపారు. త్రాగునీరు,పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్ తదితర వాటి గురించి మరియు పోలీసులు,అధికారుల సహకారంతో ముందుకెళ్తున్నామని ఆలయ ఈవో మరియు ఆలయ ధర్మకర్త మందడి నారాయణరెడ్డి అన్నారు.

About Author