NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేరనికి తాండలో గొడ్డలితో దాడి.. హత్యాయత్నం కేసు నమోదు

1 min read

గాయపడిన రాము నాయక్ ఆసుపత్రిలో చికిత్స – ముద్దాయి రాఘవేంద్ర నాయక్‌పై కేసు

హోళగుందన్యూస్ నేడు: నేరనికి తాండ గ్రామంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడనే అనుమానంతో రాము నాయక్ అనే వ్యక్తిపై రాఘవేంద్ర నాయక్ గొడ్డలితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుందని, ఈ దాడిలో గాయపడిన రాము నాయక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు.బాధితుడు రాము నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముద్దాయి రాఘవేంద్ర నాయక్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన పేర్కొన్నారు.

About Author