NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు జిల్లాలో రన్ ఫర్ జీసస్- 2026 కార్యక్రమం

1 min read

పాత బస్టాండ్ నుండి ఇండోర్ స్టేడియం వరకు కొనసాగిన ర్యాలీ

 ప్రపంచమంతటా శాంతి సామరస్యాలు నెల కోవాలి

 రెవరెండ్ డా:బిషప్ జయరావు పొలిమేర

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పాపుల రక్షణ కోసం శిలువుపై ప్రాణత్యాగం చేసి త్యాగానికి మారుపేరుగా నిలిచిన క్రీస్తు మహిమను ఘనపరిచేందుకు అంతా కలిసికట్టుగా ఆయన చూపిన బాటలో పయనించాలని ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్భోదించారు. ఏలూరు పరిసర ప్రాంతాల క్రైస్తవ సంఘాలు,  దైవ సేవకులు,  నాయకులు,  విశ్వాసులు ఆధ్వర్యంలో శనివారం ఏలూరులో రన్ ఫర్ జీసెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ర్యాలీని ఏలూరు పీఠాధిపతి బిషప్ జయ రావు పొలిమేర, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, బిషప్ డాక్టర్ జాన్ ఎస్.డి. రాజు, బిషప్ డాక్టర్ ఎం ఏలీషా రాజు,  ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు  ప్రారంభించారు. ఈ ర్యాలీ ఇండోర్ స్టేడియం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బిషప్ జయ రావు మాట్లాడుతూ మనిషి త్యాగాల ద్వారా మానవ సమాజానికి సేవ చేయవచ్చని, సాటి మానవుల క్షేమం కోసం రక్తం చిందించవచ్చని క్రీస్తు తన ప్రాణం త్యాగం ద్వారా ఉద్భోదించారన్నారు. ప్రభువు త్యాగం లోక రక్షణ కోసమేనని, అందుకే పాపులను తన రక్తంతో కడిగి ప్రభువయ్యాడని వివరించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సమస్త మానవాళి లో ఈర్ష్య, అసూయ, ద్వేషం తదితర అవగుణాలను రూపుమాపి, ప్రతి ఒక్కరిని సన్మార్గంలో నడిపించేందుకే క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చారని పేర్కొన్నారు. క్రీస్తు ప్రభువు స్ఫూర్తితో ప్రేమ, కరుణ, క్షమ,  సహనం, త్యాగం వంటి సద్గుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఆగిపోయి ప్రపంచమంతటా శాంతి, సామరస్యాలు నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ శాంతియుత జీవనాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు. మనుష్యుల మధ్య స్నేహ సంబంధాలు మరింత పటిష్టం కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రన్ ఫర్ జీసెస్ కార్యక్రమం కో-ఆర్డినేటర్ బురదగుంట క్రాంతి రవికిరణ్, పెరికె వరప్రసాదరావు, ఆర్నేపల్లి తిరుపతి, హెన్రీ డొమినిక్, ఫాదర్ మైకేల్, బీరపోగు యోహాన్, టి శ్యాంబాబు, పివి. రాజు, బేతాళ సతీష్ బాబు, రత్నరాజు, ఫాదర్ బాల, పాస్టర్ పి.జీవన్ కుమార్, కిరణ్, యేసు రాజ్యం, జింజు మోసెస్, జి స్వర్ణకుమారి, సాల్మన్ రాజు, సుభద్ర రావు, రాజ్ కుమార్, రవికుమార్, యోబు తదితరులు పాల్గొన్నారు.

About Author