జగన్ అమరావతి వ్యతిరేకి…
1 min read

అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ది
రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్
కర్నూలు ,న్యూస్ నేడు: జగన్ మోహన్ రెడ్డి అమరావతి వ్యతిరేకి అని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్ విమర్శించారు. ఈమేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ కి రాజధానిని లేకుండా చేసి మూడు రాజధానుల పేరిట రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసిన అమరావతి ద్రోహి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు. జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు పట్టవు.. ఆయనకు చిత్తశుద్ధి లేదు అని మొన్న ఆయన విలేకరుల సమావేశంలో మరోసారి ఋజువు చేశారు. అమరావతి రాజధాని ప్రాంత్రం అభివృద్ధి పనులు ఓర్వలేక ఖర్చుల గురించి అభియోగాలు మాట్లాడటం సబబు కాదు. గత ప్రభుత్వంలో మూడు రాజధానుల పేరుతో జగన్ చేయాలనుకున్న విచ్చిన ఖర్చు ఆయన వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని పునఃనిర్మించేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, మాది అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రజా ప్రభుత్వం అని తెలిపారు. ప్రజలకు మంచి పాలన అందించాలని రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా జగన్ మోహన్ రెడ్డి అమరావతి రాజధాని ప్రాంతాన్ని కదిలించలేరని ఈ సందర్భంగా సూరి మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడారు.

