NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనాధ బాలలను అక్కున చేర్చుకుని నూతన జీవితాన్ని అందించిన జిల్లా కలెక్టర్

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కన్నతల్లి చనిపోయి  అనాథలైన  ముగ్గురు పిల్లలను గాలికి వదిలేసి ఎటో వెళ్లిపోయిన తండ్రి, ఈ కారణంగా అనాధలైన ముగ్గురు చిన్నారులను అక్కున చేర్చుకుని వారికి నూతన జీవితాన్ని జిల్లా కలెక్టర్  వెట్రీ సెల్వీ  అందించారు. ఏలూరు జిల్లా కుక్కునూరు చెందిన ముగ్గురు చిన్నారులు ఏడు సంవత్సరాలు,  ఆరు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాలు వయసు కలిగిన బాలికల తల్లి ఇటీవల మరణించింది. తండ్రి పిల్లలను వదిలేసి ఏటో వెళ్లిపోయారు.  తల్లిదండ్రులు లేక బాల్యాన్ని భారంగా దీనస్థితిలో  ఉన్న వారి పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్  వెట్రిసెల్వి సదరు పిల్లల పరిస్థితిని పరిశీలించి తీసుకురావలసిందిగా  ఐసిడిఎస్ పీడీ శారద మరియు జిల్లా బాలల సంరక్షణ అధికారి   సిహెచ్ సూర్య చక్రవేణి ని ఆదేశించారు.  కలెక్టరేట్ లో సదరు బాలికలతో కలెక్టర్ కొంతసేపు మాట్లాడి వారి వివరాలు, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి కొత్త బట్టలు, చెప్పులు, బిస్కెట్లు, డ్రాయింగ్ పుస్తకాలు, కలర్ పెన్సిల్ లు నోట్ బుక్స్ ఇచ్చి, తదుపరి చర్యల తీసుకోవలసిందిగా  జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సూర్య చక్రవేణికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆదరణ కరువై, సంరక్షణ అవసరమైన పిల్లలకు సంరక్షించేందుకు బాలల సంక్షేమ సమితి ఏలూరు సిబ్బంది  దెందులూరు బాలసదనం  నందు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు సదరు బాలికలను  జాయిన్ చేసి, వారికి భోజన, వసతి సదుపాయాలతో పాటు విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  ఈ సందర్భంగా బాలికలు కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేసారు. ఐసిడిఎస్ పీడీ  పి శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి   సిహెచ్ సూర్యచక్రవేణి, డిసిపియు సిబ్బంది రాజకుమార్, రాజు, రాజేష్, కుక్కునూరు   సిడిపిఓ అనంత లక్ష్మీ, సూపర్వైజర్ రుక్మిణి, పిల్లలు కి మేనత్త వరుస అయిన  కుమారి వారి కుమారుడు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *