NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వం పై ఫ్యాప్టో మలి దశ ఉద్యమం తీవ్రతరం!

1 min read

స్పాట్ కేంద్రాల్లో ఫ్యాప్టో నిరసన కార్యక్రమం విజయవంతం!!

కర్నూలు, న్యూస్​ నేడు: నేటి ఉదయం పది మూల్యాంకన కేంద్రం అయిన మాంటిస్సోరి స్కూల్ ఎ.క్యాంపు యందు నిరసన కార్యక్రమం కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ ఎం మధుసూదన్ రెడ్డి మరియు సెక్రటరీ జనరల్ జి భాస్కర్ నాయకత్వం లో చేపట్టారు. ఉదయం ఎనిమిది గంటలు నుండి వందలాది పురుష మరియు మహిళా ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమంలో నల్ల బ్యాడ్జిలను ధరించి తమ డిమాండ్లను నినదించారు.ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్ ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు మరియు కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇంచార్జి ప్రకాశ్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పి ఆర్ సి కమిటీ నియమించి ఐ ఆర్ 30% ప్రకటించాలని  మరియు సి పి ఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవాలి అని లేని పక్షం లో ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం ఆమరణ నిరాహార దీక్ష కు కూడా సిద్ధ పడుతుందని ప్రకటించారు.26 జిల్లాల యందు మూల్యాంకనం కేంద్రాల్లో ఈ నిరసన దీక్షకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొనకపోతే ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు.పి ఇ టి అసోసియేషన్ నుండి లక్ష్మయ్య మాట్లాడుతూ గతంలో పాలకులు చేసిన ఉపాద్యాయ మరియు ఉద్యోగ వ్యతిరేక చర్యలు ఈ ప్రభుత్వం కూడా చేపట్టే ప్రయత్నం చేస్తుంది అటువంటి ప్రయత్నాలు చేయొద్దని ప్రభుత్వం ను హెచ్చరించారు, ప్రతి 250 మందికి ఒక ఫిజికల్ డైరెక్టర్ పోస్టును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.నిరసన ప్రదర్శన అనంతరం ఫ్యాప్టో నాయకుల బృందం కర్నూలు జిల్లా విద్యాధికారి సుధాకర్ ని కలసి గత సంవత్సరం మూల్యాంకన బకాయిలు వెంటనే చెల్లింపులు జరపాలి అని , ప్రస్తుతం జరుగుతున్న మూల్యాంకనం రెమ్యునరేషన్ ను మూల్యాంకనం పూర్తి అయిన వెంటనే చెల్లింపులు జరపాలి అని మరియు మూల్యాంకనం కేంద్రం లో సౌకర్యాలు మెరుగు పర్చాలి అని కోరగా వారు సానుకూలంగా స్పందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *