NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సర్వభూత దయయే తపస్సు

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.

కరిమద్దెలలో ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  సర్వభూతములపై దయకలిగి ఉండడమే నిజమైన తపస్సని, భూతదయ పరమాత్కృష్టమైన మార్గమని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గడివేముల మండలం, కరిమద్దెల గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. గత మూడు రోజులు కె. సిద్ధారెడ్డి శ్రీమద్రామాయణం, మహాభారతం, భాగవతంపై చేసిన ప్రవచనాలు,తెలుగు నాగరాజుబృందం చేసిన భజనలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక భక్త సమాజ సభ్యులు ఎ. సోమసుందర రెడ్డి, యం. శివారెడ్డి, కె.శివారెడ్డి, కె. నారాయణ, ఎస్.శేఖర్ రెడ్డి, గుండం వెంకట రెడ్డి, జి. జయమ్మ, పూజారి కరణం జ్యోతి, పి. రామలక్ష్మమ్మ, అరుణ లక్ష్మి, ఎ. ఎల్లమ్మ, కుమ్మరి వెంకట సుబ్బమ్మ, లక్ష్మిదేవి, సుబ్బలక్ష్మన్న, హరిత, శోభ, చెన్నమ్మపాటు భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *