కర్నూలు సర్వజన వైద్యశాలలో భారీగా స్టాఫ్ కొరత
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఏఐటియుసి , అనుబంధ సంఘమైన ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూల్ శాఖ అధ్యక్షులు బాలు నాయక్ మరియు కార్యదర్శి సురేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల, గాంధీ విగ్రహం ఎదుట, కర్నూలు నందు గత 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తలపెట్టిన నల్ల బ్యాడ్జీల ధరించి నిరసన కార్యక్రమంలో భాగంగా, ఈరోజు ఏపీ జేఏసీ చైర్మన్ మరియు ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వి జవహర్లాల్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సి కాశన్న ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఏపీ జెఎసి చైర్మన్ వి జవహర్లాల్ మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన వైద్యశాల యందు దాదాపు 1500 పడకల సామర్ధ్యంతో ఉన్న సర్వజన వైద్యశాల యందు మంజూరు పోస్టులు అనగా ఎంఎన్ఓ లు మరియు ఎఫ్ఎన్ఓలు లు మరియు స్టాఫ్ నర్స్ లు లేకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే రాయలసీమలోనే అతిపెద్ద వైద్యశాలైన ఇక్కడ చాలా తక్కువ క్యాడర్ స్ట్రెంత్ ఉండడం చాలా బాధాకరమైన విషయం అంతే కాకుండా మీరు తలపెట్టిన ప్రభుత్వం నుంచి రావాల్సిన 12వ పీఆర్సీ సాధించటం మరియు 4 డిఏలు బకాయిలు ,మరియు సిపిఎస్ రద్దు, ఇంకా సమాన పనికి సమాన వేతనం , కాంట్రాక్టు ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయడం అంతవరకు 100% శాతం గ్రాస్ జీతం ఇవ్వడం ఇలాంటి అనేకమైన డిమాండ్లు మీవే కాకుండా ఈ డిమాండ్లు మాకు కూడా వర్తిస్తాయి కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర జేఏసీ నాయకత్వం బలంగా పోరాటం చేస్తుంది ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు అని తెలియజేశారు.ఇకపోతే సర్వజన వైద్యశాల యందు భారీగా స్టాప్ తక్కువగా ఉండటం వలన పని ఒత్తిడితో ఉద్యోగులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు అని ఈ విషయంలో ఏపీ జెఎసి పక్షాన రాష్ట్ర సంఘంతో మాట్లాడి న్యాయం చేసే దిశగా పోరాటం చేస్తామని అంతేకాకుండా మీరు చేస్తున్న ఈ పోరాటానికి ఏపీ జేఏసీ, కర్నూలు జిల్లా పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము అని తెలియజేశారుఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన కర్నూల్ నగర కార్యదర్శి ఎం రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి కెసిహెచ్ కృష్ణుడు, ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బంగారి,ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, ఏపీ హంస నగర అధ్యక్షులు గోవిందు,మరియు ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూల్ నగర ఉపాధ్యక్షులు సాయిరాం, నగర డిఈసి మెంబర్ మద్దయ్య ఇంకా ఇతర ఎన్జీఓ కార్యవర్గ సభ్యులు మరియు జీజీహెచ్ మెడికల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

