NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోషకాల ఆహారంతో నే ఆరోగ్యం…

1 min read

లీ ఫౌండేషన్ అద్వర్యంలో ఉచిత మోగా వైద్య శిబిరం.

రక్తహీత మెరుగుపర్చుకున్నేందుకు శ్రద్ద చూపాలి.

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి.

విశాఖపట్నం,పెందుర్తి న్యూస్​ నేడు: ఆరోగ్యాన్ని కాపాడుకున్నేందుకు ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని,ప్రధానంగా పోషకాలతో కూడిన అహారాన్ని తీసుకోవడం ద్వారా శరీర ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవచ్చని లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి పేర్కొన్నారు. తీసుకున్నేందుకు విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం, నరవలోని బెహరా నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 250 మంది నర్సింగ్ విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఉచిత వైద్య ​శిబిరం ప్రధానంగా విద్యార్థులకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు వీటిల్లో ముఖ్యంగాఆంత్రోపోమెట్రిక్ పరీక్షలు (ఎత్తు, బరువు కొలతలు)హీమోగ్లోబిన్ పరీక్ష (రక్తహీనత గుర్తింపు)బాడీ కాంపోజిషన్ విశ్లేషణ పోషకాహార సంప్రదింపులు పరీక్షల అనంతరం, న్యూట్రిషనిస్ట్ నివేదికలను సమీక్షించి, రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని ఎలా పెంచుకోవాలి మరియు శరీర ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  లీ ఫౌండేషన్,లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ల  లీలా రాణి హాజరయ్యాడు ఈ సందర్బంగా అమె  మాట్లాడుతూ వేసవిలో ద్రవ పదార్ధాలు అధిక మొత్తంలో తీసుకోవాలని,నాణ్యమైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కో ఆర్డినేటర్లు సరోజిని, జయలక్ష్మి, న్యూట్రిషనిస్ట్ మాధురి, మరియు క్రాంతి పాల్గొన్నారు. అలాగే బెహరా నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ బెహరా విజయ చైతన్య , ప్రిన్సిపాల్స్ ఎన్. వరలక్ష్మి, డాక్టర్ ఎ. ఇందుమతి, మరియు జి.ఎన్.ఎం ప్రతినిధులు భాగ్యలత, పావని, లీ ఫార్మా టీమ్ సభ్యులు ఈ శిబిరంలో పాల్గొన్నారు.సమిష్టి కృషితో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *