గిరిజన తండాల సమగ్ర అభివృద్ధి టిడిపి లక్ష్యం
1 min read

చెరువు తండాలో సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే శ్యాం కుమార్
న్యూస్ నేడు, పత్తికొండ: గిరిజన తండాల సమగ్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ స్పష్టం చేశారు. గురువారం తుగ్గలి మండలం చెరువు తండా గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, అభివృద్ధిని నిలిపివేసిందని మండిపడ్డారు. “అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ, ప్రజల సంక్షేమం అంటే టీడీపీనే” అని స్పష్టం చేశారు.తండా గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతులు అన్నీ టీడీపీ హయంలోనే వేగంగా అభివృద్ధి చెందాయని, వైఎస్సార్సీపీ పాలనలో మాత్రం గ్రామాలు వెనుకబడ్డాయని విమర్శించారు.అలాగే తండా గ్రామాలను ఇతర గ్రామాల మజరాల నుంచి బయటకు తీసి, వాటికి స్వతంత్ర గుర్తింపు ఇచ్చి, సర్పంచ్ వ్యవస్థను తీసుకువచ్చింది. తెలుగుదేశం పార్టీయే అని ఘాటుగా చెప్పారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కె.ఈ. కృష్ణమూర్తి దూరదృష్టి ఫలితమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో చెరువు తండా గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు జయరాముడు నాయక్, దేవమ్మ మరియు ఆమె భర్త జయరాముడు నాయక్ దంపతులు వైఎస్సార్సీపీ వైఫల్యాలకు విసిగి, ప్రజల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ “ఇది కేవలం ఆరంభం మాత్రమే, రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీకి భారీ షాకులు తప్పవు, గ్రామ స్థాయిలో ప్రజలు టీడీపీ వైపు పెద్ద ఎత్తున మళ్లుతున్నారు” అని స్పష్టం చేశారు.

