పేదింట ‘ షేక్ మరియా’ ప్రతిభ
1 min read

ఇంటర్ ప్రథమ బైపీసీలో అత్యుత్తమ మార్కులు
- జిల్లాలో టాప్ –3 లో నిలిచిన విద్యార్థిని
- అభినందించిన ఎస్.ఆర్. కళాశాల యాజమాన్యం
కర్నూలు ఎడ్యుకేషన్, న్యూస్ నేడు : పేదింట కుటుంబంలో జన్మించిన షేక్ మరియా ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి… కళాశాలకు.. జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. కర్నూలు నగరంలోని గడ్డావీధికి చెందిన షేక్ మన్జూర్ అహ్మద్ ఓ మసీదులో ప్రార్థన చేసే ఇమామ్. ఆయన కూతురు షేక్ మరియా సదాఫ్ స్థానిక విద్యా నగర్ లోని ఎస్. ఆర్. కళాశాలలో ఇంటర్మిడియట్ చదువుతోంది. రెండు రోజుల క్రితం వచ్చిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో షేక్ మరియా సదాఫ్ బైపీసీ లో 450/455 మార్కులు సాధించి.. కర్నూలు జిల్లాలో మూడవ స్థానంలో నిలిచింది. కళాశాలలో మొదటి ర్యాంకు సాధించింది. క్రమ శిక్షణ, పట్టుదల, ఏకాగ్రతతో ఎప్పటికప్పుడు సబ్జెక్టును చదువుతూ.. నేర్చుకోవాలని, ఆధునిక టెక్నాలజీని కూడా పరీక్షల సమయంలో ఉపయోగించుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించగలరని ఈ సందర్భంగా ఎస్ ఆర్ కళాశాల విద్యా నగర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ రవీంద్ర గౌడ్ , వైస్ ప్రిన్సిపల్ ఇమ్రాన్ తెలిపారు. జిల్లాలోని ఇతర కళాశాలలకు ధీటుగా తమ విద్యార్థిని సత్ఫలితాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని ఎస్. ఆర్. కళాశాల జోనల్ ఇన్చార్జ్ టి. రఘువీర్ పేర్కొన్నారు.

