NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదలకు వరం… సీఎంఆర్ఎఫ్

1 min read

23 మందికి  చెక్కులు పంపిణీ చేసిన మంత్రి టీజీ భరత్ గుప్తా

కర్నూలు, న్యూస్ నేడు : ముఖ్యమంత్రి స‌హాయ నిధి ద్వారా పార్టీల‌కు అతీతంగా ప్రజ‌ల‌కు అండ‌గా ఉంటున్నామ‌ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా అన్నారు. క‌ర్నూలు న‌గ‌రంలోని ఆయ‌న కార్యాల‌యంలో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 23 మందికి ముఖ్యమంత్రి స‌హాయ‌నిధి ద్వారా మంజూరైన‌ చెక్కులు ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆద‌వేని ల‌క్ష్మీదేవికి సంబంధించి రూ. 2,12,632, కొప్పార‌పు కోటేశ్వర‌స్వామి రూ.2,00,785, గుడా శంక‌ర్ కు సంబంధించి రూ.36,084, ఆర్. ర‌ఫిక్ రూ.2,01,786, అరిపిర్ల రోహిత్ రూ.9,101, రామ కళావ‌తి రూ.72,918, కంది క్రిష్ణ మోహ‌న్ రూ.6,00,000, జంగాల అరుణ‌మ్మ రూ.25,655, బొర్రా అక్షయ రూ.38,795, ముంతాజ్ బేగం రూ.1,05,974, గుజ్జ‌ల సాద్విత రూ.29,084, పి.ప‌ద్మ రూ.20,795, శాంతి రూ.24,000, మ‌హ‌బూబ్ బాషా రూ.47,795,  సిరికోలం గోరంట్ల పార్థసార‌ధి రూ.66,720, గ‌డిగ గోవింద‌రాజులుకు సంబంధించి రూ.77,542, షేక్ మ‌హ‌మ్మద్ ఇషాక్ రూ.1,39,650, ఇక్బాల్ బాషా రూ.30,000, ప్రవీణ్ కుమార్ రూ.12,101, గ‌డ్డెపోగు స‌రస్వతి ఎల్.ఓ.సి రూ.1,00,429, సంద్యపోగు కిర‌ణ్ రూ.65,918, బోయ శ్రీనివాసులు రూ.2,03,236, శాంతి స్వరూప్ రూ.91,842ల చెక్కులు అందించారు. ఆప‌ద‌లో ఉన్న వారికి ముఖ్యమంత్రి స‌హాయ‌నిధి ద్వారా అండ‌గా ఉంటున్నట్లు టీజీ భ‌ర‌త్ గుప్తా తెలిపారు. స‌హాయం పొందిన వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నార‌ని చెప్పారు. కూట‌మి ప్రభుత్వం ప్రజ‌ల‌కు ఎల్లప్పుడూ మేలు చేసేవిధంగా ప‌నిచేస్తుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా చెక్కులు తీసుకున్న వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తాకు ప్రత్యేక కృత‌జ్నత‌లు తెలియ‌జేశారు.

About Author