కార్పోరేట్ కు ధీటుగా..ప్రభుత్వ పాఠశాలలు
1 min read

మాటలు చెప్పడం కాదు మన్ననలు పొందాలి
70 వేల విద్యార్థులకు 9 కోట్లు తల్లికి వందనం
నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య..
ఘనంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చి దిద్దడం జరిగిందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ మరియు మోడల్ పాఠశాలల్లో గురువారం జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు (పీటిఏ) సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం డబ్బులు వేశామని విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకు వచ్చామని నాణ్యమైన విద్యను అందించేందుకు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తూ విద్యలో పెను మార్పులు చేస్తూ ఉన్నామని అన్నారు.విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నామని విద్యార్థులకు చదువు ఉంటే తరగతి ఆస్తి చదువుకుంటే ఎక్కడైనా తిరగవచ్చు.ఈ మండలంలో 70 వేల మంది విద్యార్థులకు దాదాపుగా 9 కోట్లు డబ్బులు తల్లుల అకౌంట్లలో పడ్డాయని అన్నారు.మాటలు చెప్పడం కాదు ప్రజల మన్ననలు పొందాలని అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పాఠశాలలు పనిచేయాలని మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నా సరే ఇక్కడ చదివే పిల్లల్ని ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఉపాధ్యాయులకు సూచించారు.గతంలో మోడల్ పాఠశాలకు సిమెంటు రోడ్డు త్రాగునీటి బోర్ వేయించాలని నన్ను అడగ్గా ఒక్క నెలలోపే వేయించానని అన్నారు.జిల్లా పరిషత్ పాఠశాలకు ఉపాధి హామీ నుండి కాంపౌండ్ నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మోడల్ పాఠశాల,కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా అలరించాయి.మండలంలోని వివిధ పాఠశాలల్లో తల్లితండ్రుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ మండల ప్రత్యేక అధికారి జాకీర్ హుస్సేన్,ఎంపీడీఓ పి దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి,ఎంఈఓ ఫైజు న్నిసా బేగం,గ్రామ సర్పంచ్ జయలక్ష్మమ్మ,ఏఓ పీరు నాయక్,రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం,ఎస్ఐ హెచ్ ఓబులేష్,ఏఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ యాదవ్,పాఠశాలల ప్రిన్సిపాల్ బీటీ శ్రీదేవి,సాయి తిమ్మయ్య,ఎస్ఓ విజయలక్ష్మి,ఎస్ఎంసీ కమిటీ చైర్మన్లు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.


