NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ అధినేత రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలి

1 min read

పత్తికొండ స్టేషన్లో ఫిర్యాదు                                                

న్యూస్ నేడు పత్తికొండ:  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని పత్తికొండ పోలీస్ స్టేషన్లో వైసీపీ శ్రేణులు మాజీ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ ఆధ్వర్యంలో గురువారం ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యురాలు నియోజకవర్గ కోఆర్డినేటర్ కంగాటి శ్రీదేవమ్మ  మాట్లాడుతూ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌లో మహిళలపై ప్రసారమైన వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరంగా ఉన్నాయని, అవి మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా, సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.మీడియా సంస్థలు సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఇలాంటి అసభ్యకర ప్రసారాలు చేయడం తగదని  పేర్కొన్నారు.ఇలాంటి వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీస్తాయని, వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పత్తికొండ సీఐ జయన్నను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె  డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ మెంబర్లు,జిల్లా ఉపాధ్యక్షుడు,మండల కన్వీనర్లు,ఎంపీపీలు, జడ్పిటిసిలు,వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ నాయకులు, పత్తికొండ నియోజకవర్గం అనుబంధ సంఘాల అధ్యక్షులు, పత్తికొండ, తుగ్గలి,మద్దికేర మండలాల మాజీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వార్డు మెంబర్లు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *