డిగ్రీ వరకు కష్టపడి బాగా చదివి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలి
1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: విద్యార్థులందరూ డిగ్రీ వరకు కష్టపడి బాగా చదివి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.బుధవారం పత్తికొండ మండల కేంద్రంలోని బిసి సంక్షేమ బాలికల వసతిగృహం ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం ఏమి పెట్టారని , భోజనం ఏ విధంగా ఉందని, టాయిలెట్ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని, కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.. సమయము వృథా చేయకుండా 8 వ తరగతి నుండి డిగ్రీ వరకు కష్టపడి బాగా చదివి జీవితంలో మంచి ఉద్యోగం సాధించి స్థిరపడాలని కలెక్టర్ విద్యార్థులకు తెలిపారు.. వసతి గృహాల్లో చదువుకొని చాలా మంది గొప్ప గొప్ప స్థాయిలో స్థిరపడ్డారని, వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కస్టపడి చదువుకోవాలన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో చదువు విడవకూడదన్నారు.వసతి గృహంలోని వంట గదిని పరిశీలిస్తూ సాంబార్ ను రుచి చేస్తూ రుచి బాగుందని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కాంపౌండ్ వాల్ ప్యాచ్ వర్క్ లు చేయించాలని వసతి గృహం అధికారులు, బాలికలు కోరగా 10 రోజుల్లో కాంపౌండ్ వాల్ ప్యాచ్ వర్క్ లు చేయిస్తానని కలెక్టర్ తెలిపారు.కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రసూన తదితరులు పాల్గొన్నారు.

