NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు కొండంత అండ..సీఎం రిలీఫ్ ఫండ్

1 min read

ఇంటికెళ్లి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

మిడుతూరు, (నందికొట్కూరు) న్యూస్​ నేడు   : ప్రజలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి అందజేస్తున్నామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. మంగళవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని వివిధ గ్రామాల్లో 6 లక్షల 9వేల 644 రూ.ల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులనుఎమ్మెల్యే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారికి భరోసానిస్తూ చెక్కులను అందజేశారు.ఈ సందర్బంగా కష్టాల్లో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.సీఎం సహాయనిధి  లబ్దిదారుల వివరాలు:వీపనగండ్ల:జి వెంకటేశ్వర్ రెడ్డికి 86,870రూ.లు,మిడుతూరు కె సత్యనారాయణ 48,333 రూ.లు,విద్యాపోగుల రవి 36,337 రూ.లు,కటకం సత్య నారాయణకు లక్ష 40 వేలు,సున్నం పల్లె కమతం వెంకటేశ్వరమ్మకు 44,223 రూ.లు,తలముడిపి పెద్ద తిరుపతి 98,470 రూ.లు,రోళ్లపాడు ఉప్పరి బాల గుర్రప్ప 30,756 రూ.లు,చెరుకుచెర్ల గద్దల మణెమ్మకు 1,24,655 రూ.లు లబ్ధిదారుల గ్రామాలకు వెళ్లి స్వయంగా ఎమ్మెల్యే వారికి చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి.దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,వంగాల శివరామరెడ్డి,కమతం రాజశేఖర్ రెడ్డి,జయరాముడు,నాగ స్వామిరెడ్డి,నాగేంద్ర,సర్వోత్తమ్ రెడ్డి,పలుచాని మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

About Author