గురుకుల ప్రవేశానికి ఆహ్వాన పరీక్ష ప్రకటన
1 min read

బీబీపేట, న్యూస్ నేడు : తెలంగాణ రాష్ట్రంలో గురుకుల సంక్షేమ హాస్టల్ల ఐదో తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పరీక్షలను నిర్వహించి సీట్లను కేటాయించడం కోసం తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను ఆరోగ్యవంతమైన పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు అందించే దేశానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం కోసం ఈ నెల నుండి ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఇంగ్లీష్ తెలుగు మీడియాలలో చేరడం కోసం విద్యార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని మహాత్మ జ్యోతిబాపూలే ప్రిన్సిపాల్ గోపిచంద్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు వంద రూపాయల రుసుముతో ఆన్లైన్లో విద్యార్థుల యొక్క ఆధార్ కార్డు బోనఫైడ్ ఫోటోను ఆన్లైన్లో పొందుపరిచి అప్లై చేసుకోవాల్సిందిగా వారు ఒక ప్రకటనలో తెలియజేశారు నిజాంబాద్ జిల్లాలో వారి వారి విద్యార్థుల ప్రావిణ్యాన్ని బట్టి గీత కేటాయింపు జరుగుతుందని వారు తెలియజేశారు.

