NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గాయపడ్డ వారిని పరామర్శించిన సిద్ధార్థ రెడ్డి..

1 min read

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  గాయపడిన వారిని రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పరామర్శించారు.శుక్రవారం నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిధిలోని ప్రాతకోట గ్రామ వైస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు పలుచాని విజయ మోహన్ రెడ్డి భార్య పలుచాని లీలావతి  (75) ఆనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న సిద్ధార్థ రెడ్డి వారింటికీ వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అదేవిధంగా లక్ష్మాపురంలో చిన్న మాబు సాహెబ్,వజీర్ భాష కింద పడి గాయాలు కావడంతో వారిని సిద్ధార్థ రెడ్డి పరామర్శించారు.ఆరోగ్య స్థితిగతులను వారిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ  జెట్‌పిటిసి పుల్యాల నాగిరెడ్డి,వైసీపీ జిల్లా ఉపాద్యక్షుడు రమేష్‌ నాయుడు,పార్టీ రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ జబ్బార్,మాజీ మార్కెట్ యార్ఢ్‌ చైర్మన్‌ తువ్వా చిన్న మల్లారెడ్డి పాల్గొన్నారు.

About Author