NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్మికులను ఆదుకునేందుకు..ప్రత్యేక చట్టం తేవాలి

1 min read

సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు  : గనేట్ లలో పనిచేసే కార్మికులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎం నాగేశ్వరావు డిమాండ్ చేశారు.గురువారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామంలో ఉన్న గనేట్లలో పనిచేస్తున్న కార్మికుల దగ్గరికి వెళ్లి సీపీఎం బృందం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నాగేశ్వర రావు మాట్లాడుతూ గని కార్మికులు ఎండనక వాననక పని చేస్తూ ప్రమాదాల్లో గని కార్మికులు మరణిస్తున్నారని వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ప్రభుత్వం గని కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు సమగ్ర చట్టం చేసి ఆ కుటుంబాలు వీధిన పడకుండా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.గని కార్మికులకు ప్రభుత్వం లేబర్ కార్డులు అందించాలని అదిక బరువు పనులు చేయడం వల్ల ప్రమాదంలో కార్మికులు చనిపోతున్నారు.కుటుంబాలు ఆదుకునేందుకు 50 సంవత్సరాలకే పింఛన్ సౌకర్యం కల్పించాలని అన్నారు.వారికి ప్రభుత్వమే హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు టి ఓబులేష్,ఎం కర్ణ,లింగస్వామి,ఎస్ ఉస్మాన్ భాష,వి శ్రీనివాసులు,గని కార్మికులు కే వెంకటేశ్వర్లు, శేఖర్,బాబు పాల్గొన్నారు.

About Author