ఘంటసాల వర్ధంతి కళాకారుల ఘన నివాళి…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు నగరం నందలి తెలుగు తోట నందు ఉదయం 11 గంటలకు స్వర్గీయ గాన గాంధర్వులు అమరజీవి ఘంటసాల వర్ధంతి కళాకారుల ఘన నివాళి ఉపాధ్యక్షులు డి దస్తగిరి, మరియు ప్రధాన కార్యదర్శి ఎన్టీఆర్ అవార్డు గ్రహీత, పి,హనుమంతరావు చౌదరి అధ్యక్షతన జరిగింది. రంగస్థల కళాకారులు స్వర్గీయ ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, స్వర్గీయ ఘంటసాల గానం గాత్రం పద్యం ప్రతి తెలుగు ఇంటా ప్రతిరోజు వినిపిస్తుందని అందుకే పద్మశ్రీ ఘంటసాల అమరజీవి అని ఉపాధ్యక్షులు డి దస్తగిరి , డి పుల్లయ్య, అన్నారు. స్వాతంత్ర సమరయోధులుగా, గాయకులుగా, సంగీత దర్శకులుగా, నటుడిగా వివిధ శాఖలలో నిష్ణాత కలిగిన విశిష్ట కళాకారులు స్వర్గీయ ఘంటసాల అని కార్యనిర్వాహక కార్యదర్శి, డాక్టర్, బైలుప్పల షఫీయుల్లా స్మరించుకున్నారు. కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం ఘంటసాల ఘన నివాళి కార్యక్రమానికి రంగస్థలకళాకారులు ఎన్టీఆర్ అవార్డు గ్రహీత, పి హనుమంతరావు చౌదరి, పి ,దస్తగిరి, డి పుల్లయ్య, డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా, డిఎన్వి సుబ్బయ్య, పెద్ద వెంకటేశ్వర్లు, షేక్షావలి, భాస్కర్ రెడ్డి, చిన్న వెంకటేశ్వర్లు, రాజన్న, కర్నూలు కళాకారులు పాల్గొని స్వర్గీయ ఘంటసాల వర్ధంతి నిర్వహించారు.

