వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 1976 అమలై 50 సంవత్సరాలు పూర్తి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి ఆదేశాల మేరకు వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 1976 అమలై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమరావతి వి. ఐ.టి యూనివర్సిటీ లో రాష్ట్రస్థాయి ఒక్కరోజు వర్క్ షాప్ లో కర్నూలు జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ మెంబెర్ పీ.ఎల్వీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ప్యానల్ అడ్వకేట్ లక్ష్మీనారాయణ, ప్రవీణ్, పి.ఎల్వి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేష సాయి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.ఆర్.కె కృపాసాగర్,స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఏ.పీ జి.విజయలక్ష్మి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. ఎస్.వి హిమబిందు, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ప్రతినిధి కమాండర్ అశోక్ కుమార్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల డిప్యూటీ సెక్రటరీ హెచ్ రంగేశ్వరరావు ఐ.ఏ.ఎస్, సోషల్ వెల్ఫేర్ బోర్డ్ స్టేట్ డైరెక్టర్ లావణ్య వేణి ఐ.ఏ.ఎస్, లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిషనర్ గణేషన్, చీఫ్ కమీషనర్ అఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చేతన్ ఐ.ఏ.ఎస్, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ప్రతినిధి కమాండర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొని భవిష్యత్తులో వెట్టిచాకిరీ బాధితుల వెల్ఫేర్ కొరకు తీసుకోవాల్సిన చర్యలపై వర్క్ షాప్ ను నిర్వహించారు.

