ఎమ్మెల్యే భూర్ల రామాంజనేయులుని దుర్భాషలాడటం హేయమైన చర్య
1 min read

మాలమహానాడునాయకుడు అరుణ్ కుమార్ పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
జాతీయ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు డిమాండ్
తురకపాలెంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : మన రాష్ట్రంలో మాదిగ ఎమ్మెల్యేలు 14 మంది మాల ఎమ్మెల్యేలు 15 మంది ఉన్నారు. కానీ మాదిగలు ఎక్కడ మాల ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా ఏనాడు మాట్లాడలేదు. శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులుని కించపరిచే విధంగా మాల మహా నాయకుడు అరుణ్ కుమార్ మాట్లాడటం హేయమైన చర్యగా పరిగణిస్తున్నామని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికే వరప్రసాద్ హెచ్చరించారు.గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.స్థానిక శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదు లక్షల రూపాయలను నేరుగా మీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇది ఆయన చేసిన సహాయంగా గుర్తించండిఅని పేర్కొన్నారు.ఈ సహాయం మేము చేశామని ఎవరైనా చెబితే నమ్మవద్దు. ఎవరైనా డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని గ్రామస్థులకు సూచంచారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మలమహానాడు నాయకులు అరుణ కుమార్ వాదనకు దిగడంతో, అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది తక్షణమే మలమహా నాడు నాయకుడు అరుణకుమార్ ని అరెస్ట్ చేయాలని అంబేద్కర్ పేరు చెప్పి దందలతో, చందాలు వసూలు చేసుకునే ఈ కుల సంఘాలను బహిష్కరించాలని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాద రావు డిమాండ్ చేశారు.

