ప్రధాని..ముఖ్యమంత్రి దృష్టికి మదాసి– మదారి కురువల సమస్య తీసుకువెళ్లండి..
1 min read

మంత్రి సవితమ్మకు, వైకుంఠం జ్యోతి కి వినతి పత్రం అందజేత..
ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు పట్టణంలోని ఆర్ -అండ్ బి అతిథి గృహంలో బీసీ సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మను, ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతిని కలిసి రాష్ట్రంలో మదాసి మదారి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్ జారీ విషయంలో జరుగుతున్న జాప్యం పై మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ సందర్భంగా తాలూకా కన్వీనర్ కౌడికి రాజు ప్రధాన కార్యదర్శి పెద్దహ్యాట మల్లయ్య మాట్లాడుతూమాదాసి మాదారి కురువ వర్గానికి ఎస్సీ (ఎస్సీ) కుల సర్టిఫికెట్ జారీ విషయంలో రెవెన్యూ శాఖ నుండి జరుగుతున్న జాప్యం తొలగించి, తక్షణ చర్యలు తీసుకోవలసిందిగాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో మాదాసి మాదారి కురువ వర్గానికి చెందిన ప్రజలు చాలా కాలంగా ఎస్సీ (ఎస్సీ) కుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే, స్థానిక రెవెన్యూ అధికారులు ఈ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అంతేకాక, కొందరు అధికారుల నిర్లక్ష్యం లేదా అవగాహన లోపం కారణంగా, మాదాసి మాదారి కురువ (ఎస్సీ) వర్గానికి చెందిన అభ్యర్థులకు ఎలాంటి విచారణ లేకుండా కురుబ& కురుమ (BC.B.11) కుల సర్టిఫికెట్‌లు జారీ చేస్తున్నారు. దీని వలన విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలలో హక్కుగా దక్కాల్సిన ప్రయోజనాలు కోల్పోతున్నారు.అందువల్ల, మాదాసి మాదారి కురువ వర్గానికి సంబంధించి సక్రమమైన కుల ధృవపత్రాల జారీకి తగిన ఆదేశాలు జారీ చేసి, అధికారులు జాప్యం లేకుండా పని చేయాలని మనవి.అదేవిధంగా, ఈ అంశాన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మరియు 16వ తేదీన కర్నూలుకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి కూడా నివేదించి, ప్రభుత్వ స్థాయిలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవలసిందిగా కోరుచున్నాము.మీ దయా దృష్టి మరియు తక్షణ స్పందన కోసం ఆకాంక్షిస్తూ ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రంగన్న, హనుమప్ప బెల్లం రాజు, ఎండి హల్లి సర్పంచ్ సుధాకర్, శ్రీధర్, శరణ, మాజీ సర్పంచ్ దేవేంద్రప్ప, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

