NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025- 26 విద్యా సంవత్సర అకడమిక్ ఆడిట్

1 min read

అధ్యాపకులు అడ్వైజర్స్ ఇచ్చిన సలహాలు సూచనలు తప్పక పాటిస్తాం

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్:గుత్తా గిరిబాబు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం 2025- 26 విద్యా సంవత్సరానికి గాను  అకడమిక్ ఆడిట్ జరిగింది. 2025 – 26  విద్యా సంవత్సరంలో కళాశాల వివిధ విభాగాల  అధ్యాపకులు చేసిన విద్యాసంబంధ కార్యక్రమాలను మదింపు చేస్తూ అకడమిక్ అడ్వైజర్స్ జి. ప్రకాశంబాబు మరియు డాక్టర్ డి. లావణ్య అధ్యాపకులకు సూచనలు మరియు సలహాలు ఇవ్వడం జరిగింది‌.పరిమితమైన వనరులతో విద్యా సంబంధ మరియు ఇతర కార్యక్రమాలు ప్రభావవంతంగా  నిర్వహిస్తున్నారని అన్నారు.ఈ సందర్భంగా నిర్వహించినటువంటి ముగింపు సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్:గుత్తా గిరిబాబు మాట్లాడుతూ అధ్యాపకులు అడ్వైజర్స్ ఇచ్చిన సలహాలు, సూచనలు తప్పక పాటిస్తారని అన్నారు.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె.అజయ్ కుమార్ ఐక్యుఏసి కో-ఆర్డినేటర్ ఎమ్. కృష్ణచైతన్య వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

About Author