శ్రీ సురేష్ చంద్ర బహుగుణ స్కూల్లో చిన్నారులతో చింతమనేని మమేకం
1 min read

చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2000 మంది విద్యార్థినీ,విద్యార్థులకు విందు ఏర్పాటు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : ఏలూరులో అమీనా పేటలోని శ్రీ సురేష్ చంద్రబహుగుణ పోలీస్ హైస్కూల్ ప్రాంగణంలో హేలాపురి బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న వీర వనితలకు జేజేలు కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న దాదాపు 2000 మంది చిన్నారులకు చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విందు భోజన కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం జరిగిన భోజన కార్యక్రమంలో స్వయంగా విద్యార్థులకు వడ్డిస్తూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విద్యార్థులతో మమేకం అయ్యారు.

