బెన్ట్ఫిజిక్ పోటీలలో నేషనల్ లెవల్ కి ఎంపికైన ఆదిత్య విద్యార్థి
1 min read

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆదిత్య డిగ్రీ కళాశాల, సత్రంపాడు, ఏలూరులో డిగ్రీ మూడవ సంవత్సరం బి.యస్సీ (కంప్యూటర్స్ ) చుదువుతున్న విద్యార్థి వై. భరత్ నన్నయ్య యూనివర్సిటీలో జరిగిన బెస్ట్ఫిజిక్ పోటీలలో మొదటి స్థానంలో నిలిచినట్లు ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అంతర్ కళాశాలల బెస్ట్ఫిజిక్ పురుషుల విశ్వవిద్యాలయ జట్టు ఎంపిక నిర్వహించారు. ఆ పోటీలలో డిగ్రీ మూడవ సంవత్సరం బి.యస్సీ (కంప్యూటర్స్) చుదువుతున్న విద్యార్థి వై. భరత్ 65 కేజీలలో విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచి, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సీటీ (నేషనల్ లెవెల్) కాంపిటీషన్కి ఎంపికైనట్లు పిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు తెలిపారు.మార్చి 3, 4 తేదిలలో ఆంధ్రయూనివర్సిటీలో జరిగే నేషనల్ లెవల్ కంపిటీషన్స్ లో వై. భరత్ పాల్గొంటారని పిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు తెలిపారు.బెస్ట్ఫజిక్ 65 కేజీలలో విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదట స్థానంలో నిలిచి, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సీటీ (నేషనల్ లెవెల్) కాంపిటీషన్కి సెలక్ట్ అయిన వై. భరత్ ను ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్ డా॥ ఎన్. శేషారెడ్డి , సెక్రటరి డా॥ ఎన్. సుగుణా రెడ్డి , అకడమిక్ డైరెక్టర్ డా ॥ బి.ఇ.వి. యల్. నాయుడు , పిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు , వైస్ ప్రిన్సిపాల్ డి.వి.వి. ఫణికుమార్ , మరియు అధ్యాపక, ఆధ్యాపకేతర బృందం హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వై.భరత్ భవిష్యత్తులో మరింత ఉన్నత విజయాలను సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

