జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ
1 min read

జిల్లా కలెక్టర్ & జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ రాజకుమారి
నంద్యాల , న్యూస్ నేడు: 2026-27 సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డులను నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ జి. రాజకుమారి బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో అందజేశారు.జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశంలో ఆమోదం పొందిన మొత్తం 508 మంది పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న మిగిలిన పాత్రికేయుల అర్హతలను పరిశీలించి తదుపరి కమిటీ సమావేశంలో వారికి కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు.మొదటి జాబితాలో ఆమోదం పొందిన పాత్రికేయులు సంబంధిత డీఐపీఆర్ఓ కార్యాలయం నుండి తమ అక్రిడిటేషన్ కార్డులను స్వీకరించి ప్రభుత్వం కల్పించిన ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డీఐపీఆర్ఓ, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.


